AP: సూపర్-6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించామని మంత్రి లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఈ సారి బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.