కేరళలోని కొల్లం జిల్లా కోల్లారా గ్రామంలో కొలువైన 'కొట్టంకులంగర దేవి' ఆలయం ఓ ప్రత్యేకతతో వార్తల్లో నిలిచింది. ఈ ఆలయంలో ఏటా మార్చిలో చమయవిళక్కు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవంలో పురుషులకు ప్రవేశం లేదు. ఒక వేళ వెళ్లాలంటే అచ్చం అమ్మాయిలుగా అలంకరించుకొని వెళ్లాలి. దీంతో పలువురు యువకులు అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా అలంకరించుకొని ఆలయానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.