‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రం ట్రైలర్‌ను మూవీ టీం ఇవాళ విడుదల చేసింది. మోహన్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనన్య నాగళ్ల కూడా మెయిన్ లీడ్ పోషించనుంది. డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వస్తోంది. మూవీ మొత్తం శ్రీకాకుళం యాసలో ఉండనుందని తెలిసింది. ఓ గ్రామంలో జరుగుతున్న వరుస హత్యలను హీరో ఛేదించేందుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రమని తెలుస్తోంది.