నవంబర్ 29 వరకు దేశ వ్యాప్తంగా 73 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటుకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 25 కోట్ల స్మార్టు ప్రీపెయిడ్ మీటర్లు లక్ష్యం కాగా, 19.79 కోట్ల మీటర్లు మంజూరయ్యాయని, పలు రాష్ట్రాల్లో 72.97 లక్షల స్మార్ట్‌మీటర్లు అమర్చినట్లు పేర్కొన్నారు. తమిళనాడు, త్రిపుర, రాజస్థాన్, పంజాబ్‌కు మీటర్లు మంజూరైనా ఇక్కటి కూడా ఇన్‌స్టాల్ చేసుకోలేదు.