RTC బస్సులో ప్రయాణిస్తున్న మగవాళ్లకు ఓ కండక్టర్ ఫ్రీ టికెట్(మహాలక్ష్మి టికెట్) ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో నెలకొంది. ECIL నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్తున్న ఒక బస్సు(TS02Z0267)లో ఎక్కిన యువకుడికి మహాలక్ష్మి టికెట్ ఇచ్చి, కండక్టర్ రూ.30 వసూలు చేశాడు. ఇదేమిటని సదరు యువకుడు కండక్టర్‌ను నిలదీయగా.. టికెట్ ఇచ్చే మెషీన్ సరిగ్గా పనిచేయలేదని కండక్టర్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.