తండేల్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో కొంతమంది విడుదలైన రోజే పైరసీని విడుదల చేశారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో మూవీని ప్లే చేయడం వివాదస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న నిర్మాత బన్నీ వాసు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌ను కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.