గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని విజయ్ చార్ రోడ్డు సమీపంలో ఓ బైకర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను బస్సు కింద పడడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు. హెల్మెట్ ధరించినా ప్రాణం దక్కలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.