పాడి రైతులకు ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో ఉన్న పాడి రైతులందరి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాడి పశువుల ఆరోగ్యం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం(CADCP)కు మంత్రివర్గం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా పశువులకు అందించే వ్యాక్సిన్లు తక్కువ ధరలకు లభించనున్నాయి. అలాగే రూ.3,880 కోట్లతో ప్రత్యేక పశు ఔషధ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.