IPL-2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. LSG స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ 44 పరుగులకు ఔట్ అయ్యారు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 11.3 ఓవర్‌కు మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ పెవిలియన్ చేరారు. కాగా 12 ఓవర్లు ముగిసేసరికి LSG స్కోర్ 91/4గా ఉంది. క్రీజులో డేవిడ్ మిల్లర్ (1), ఆయుష్ బదోని (14) పరుగులతో ఉన్నారు.