రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు." అని అన్నారు.