AP: అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మారేపల్లి సమీపంలో భారీ గిరి నాగు పాము కలకలం రేపింది. రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలో చక్కర్లు కొడుతూ రైతుల కంట్లో పడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో భూమి యజమాని స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చాడు. వారు అరగంట పాటు శ్రమించి పామును సజీవంగా సంచిలో బంధించి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.