మేకల కాపరిని వెంబడించిన చిరుత.. భయాందోళనలో స్థానికులు

81చూసినవారు
మేకల కాపరిని వెంబడించిన చిరుత.. భయాందోళనలో స్థానికులు
నిర్మల్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. సారంగపూర్‌ మండలం రవీంద్రనగర్‌ సమీపంలో సహ్యాద్రి కొండల వద్ద ఓ మేకల కాపరిని చిరుత వెంబడించింది. అతడు చెట్టు ఎక్కి కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రెండు మేకలను చంపినట్లు సమాచారం. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. కాగా గత మూడు రోజులుగా అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్