ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా విశాఖ వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో DC. LSG మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30 మంది అనాథ చిన్నారులు మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అవకాశం కల్పించింది. ఏసీఏ.. సొంత నిధులతో 30 టికెట్స్ కొనుగోలు చేసి విశాఖలోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందించింది. మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి చేరుకున్నారు.