ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పనకు HYD కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కల్పన నిద్ర మాత్రలు మింగినట్లు తెలిపారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా కల్పన కోలుకున్నాక పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.