AP: బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారం చేసి.. ఇప్పుడు మోసం తప్ప మరేమి చేయడం లేదని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో మోసం తప్ప ఏమీ లేదు. మ్యానిఫెస్టో హామీలను అడిగితే సమాధానం లేదు. సభలో ప్రతిపక్షం మాట వినడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6 అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. ఇప్పటివరకు ఇచ్చిందేమి లేదు.’ అని అన్నారు.