పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

53చూసినవారు
పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు
కర్ణాటకలోని బెళగావిలో దారుణం చోటుచేసుకుంది. ప్రశాంత్ కుండేకర్(29) అనే యువకుడు ఐశ్వర్య అనే యువతిని ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తల్లికి చెప్పి పెళ్లి చేయాలని కోరాడు. ముందు ఆర్థికంగా స్థిరపడమని యువతి తల్లి చెప్పింది. తర్వాత రోజు విషపు సీసాతో యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో విషాన్ని తాగించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో గొంతు కోసి చంపి.. అతడు గొంతు కోసుకుని మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్