సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా శుక్రవారం అక్కడి ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)ని సందర్శించారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఐటీఈతో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఈమేరకు స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది.