CMAT పరీక్ష తేదీ ఖరారు

60చూసినవారు
CMAT పరీక్ష తేదీ ఖరారు
కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్ (CMAT) పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఖరారు చేసింది. మే 15న CMAT పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. CMAT పరీక్షకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 23తో ముగిసింది. 24, 25, 26 తేదీల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్