TG: ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, సభకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తారని పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.