ముంబై వరుస పేలుళ్ల దోషిని.. హత్య చేసిన తోటి ఖైదీలు

71చూసినవారు
ముంబై వరుస పేలుళ్ల దోషిని.. హత్య చేసిన తోటి ఖైదీలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషి.. మున్నా అలియాస్ మహ్మద్ అలీ ఖాన్ ను ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్‌ పైప్‌తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్‌లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం జైలులోని బాత్‌రూమ్‌ ప్రాంతంలో స్నానం చేయడంపై అలీ ఖాన్, ఇతర ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్