ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తపేట పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. భర్త నుంచి దూరంగా ఉంటున్న గృహిణి శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కాగా వీరి అక్రమసంబంధానికి పాప అడ్డుగా మారడంతో శ్రీరాములుతో కలిసి పాపను చిత్రహింసలకు గురిచేస్తూ ఒంటిపై వాతలు పెడుతూ నరకయాతనకు గురిచేశారు.