మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య.. కుమారుడితో కలిసి భర్తనే హత్య చేసింది. బాబురావు పాటిల్ (56), వనితా పాటిల్ దంపతులు. వీరికి ఒక కొడుకు తేజస్ పాటిల్ ఉన్నాడు. బాబురావు పాటిల్ ఇటీవల ఇన్సూరెన్స్ తీసుకోవడంతో ఆ డబ్బుల కోసం తల్లి, కొడుకు కలిసి బాబురావు పాటిల్‌ను హతమార్చారు. పోలీసులకు అనుమానం రావడంతో విచారణ జరపగా భార్య, కొడుకు కలిసి హత్య చేసినట్లు తేల్చారు.