రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌లోని అంబేడ్కర్ కాలనీలో ఉంటున్న నాగేందర్.. తన ఇంట్లో 26 తులాల బంగారం, రూ. 2లక్షల నగదు చోరీకి గురైందని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి సమీపంలో ఉండే సునీత, భీమయ్య దంపతులపై అనుమానం ఉందని చెప్పాడు. దీంతో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి అదే రోజున సునీత, భీమయ్య దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు.