పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి శరీరానికి అవసరమైన శక్తి, తేమను అధికంగా అందిస్తాయి. అయితే చాలామంది పుచ్చకాయ తినేటప్పుడు పుచ్చ గింజలను పడేస్తుంటారు. కానీ పుచ్చ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, బి విటమిన్లు అధికంగా ఉండటంతో, శరీరం పొడిబారకుండా ఉంటుంది. అలాగే ఎముకలు, దంతాల ధృడత్వానికి దోహదపడుతాయి. వీటిని నానబెట్టి లేదా ఫ్రై చేసుకుని తినవచ్చు.