2015లో తెలంగాణ శాసనసభలో ఆరు స్థానాలకుగాను నోటిఫికేషన్ పడింది. TRS నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, TDP నుంచి ఒకరు బరిలోకి దిగారు. ఒక్కో MLCని ఎన్నుకోవడానికి 17 మంది MLAలు అవసరం. అయితే అప్పుడు TRSకు 63 మంది MLAలు.. TDPకి 15 మంది MLAలు ఉన్నారు. దీని కోసం ఇద్దరు MLAలను TDP కొనడానికి పెద్ద కసరత్తే జరిగింది. అప్పుడు బయటకు వచ్చిందే ఈ ఓటుకు నోటు కేసు.