తులిప్ గార్డెన్ విశేషాలేంటో తెలుసా?

68చూసినవారు
తులిప్ గార్డెన్ విశేషాలేంటో తెలుసా?
తులిప్ పూలు రంగురంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. శ్రీనగర్లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో ఇవి దర్శనమిస్తున్నాయి. కశ్మీర్ పర్యటకాభివృద్ధిలో భాగంగా 2007లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ ఆసియాలోనే అతి పెద్దది. దాదాపు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ ఏటా అక్టోబర్, నవంబర్ మధ్య మొక్కలను నాటితే.. మార్చి నాటికి పుష్పించడం ప్రారంభిస్తాయి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3 వేల వెరైటీలున్నాయి.

సంబంధిత పోస్ట్