ఒలింపిక్ గేమ్స్‌లో మొట్టమొదటగా 10.0 స్కోర్ చేసిన జిమ్నాస్ట్‌గా రొమేనియన్ జిమ్నాస్ట్ గ్రేట్ నాడియా కొమనేసి నిలిచారు. 1976 ఒలింపిక్స్‌లో ఆమె 14 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించారు. పారిస్ ఒలింపిక్స్ వేళ 1976 నాటి వీడియోను క్రీడాభిమానులు షేర్ చేస్తున్నారు. 1996లో ఆమె అమెరికన్ జిమ్నాస్ట్ బార్ట్ కానర్ను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్.