కొన్నిచోట్ల ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయం ఉంటుంది. ఇందులో కొందరు భయపడుతూనే నిప్పులపై పరిగెత్తి ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో గల అగ్ని మారియమ్మన్ ఆలయంలో 6నెలల చిన్నారితో పరిగెడుతూ ఓ వ్యక్తి స్లిప్ అయి అగ్నిగుండం పక్కన పడిపోయాడు. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇలాంటివి చేయడం ప్రమాదకరమని నెటిజన్లు సూచిస్తున్నారు.