రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. అప్పు ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ యువకుడిని చంపేశారు. కందుకూరు మండలం సరస్వతిగూడకు చెందిన సుధాకర్ (34) శశికళ అనే మహిళకు అప్పు ఇచ్చాడు. అయితే అత్యవసరమై తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో శశికళ తమ్ముళ్లు సుధాకర్‌పై దాడి చేసి హత మార్చారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.