పంజాబ్‌లోని జలంధర్‌లో బాజిందర్ సింగ్ అనే మతబోధకుడిపై ఇటీవల లైంగిక ఆరోపణల కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడికి సంబంధించి తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. తన ఆఫీసులో ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాళ్లపై వస్తువులు విసిరేస్తూ హంగామా సృష్టించాడు. అక్కడే ఉన్న ఓ యువకుడితోపాటు మరో మహిళలపైనా దాడి చేశాడు. వారిపై వస్తువులు విసిరేస్తూ చేయి చేసుకున్నాడు.