తెలంగాణలో యువతులతో కొందరు డ్రగ్స్ డెలివరీ చేయిస్తున్నారని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నగదు చెల్లింపులు జరుపుతున్నారని.. ఆ డబ్బును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. గత 3 నెలలకు పైగా ఈ ముఠాపై నిఘా పెట్టి ఎట్టకేలకు ముగ్గురిని పట్టుకున్నట్లు చెప్పారు.