మాల్దీవులలో శనివారం సాయంత్రం
భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు అయింది. సాయంత్రం 5:16 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. మాల్దీవుల రాజధాని మాలే నగరానికి 896 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఇక డిసెంబర్ 29న సైతం మాల్దీవులకు సమీపంలోని కార్ల్స్‌బర్గ్ రిడ్జ్‌లో వరుసగా నాలుగు భూకంపాలు సంభవించాయి.