నేడు లోక్‌సభలో ఎకనామిక్ సర్వే

66చూసినవారు
నేడు లోక్‌సభలో ఎకనామిక్ సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు లోక్‌సభలో ఆర్థిక సర్వేను ఆమె సమర్పించనున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పనితీరుపై లోతైన అవలోకనాన్ని ఈ సర్వే అందిస్తుంది. దీనిలో GDP వృద్ధి, ద్రవ్యోల్బణం రేట్లు, ఉపాధి గణాంకాలు, ఆర్థిక లోటుపై డేటా ఉంటుంది.

సంబంధిత పోస్ట్