గుండెపోటుతో బస్సులోనే మృతి చెందిన వృద్ధుడు (వీడియో)

63చూసినవారు
హైదరాబాద్ – నార్సింగ్ోలీస్ స్టేషన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెహిదీపట్నం నుంచి శంకర్ పల్లి వస్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో అకస్మాత్తుగా ఓ వృద్దుడు సృహ తప్పి పడిపోయాడు. తోటి ప్రయాణికులు దగ్గరకి వెళ్లి చూడగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. అయితే మృతి చెందిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా జనవాడ గ్రామానికి చెందిన రైతు శెట్టి బాలరాజు(63)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్