అసోంలో ఎన్నికలు.. విద్యార్థుల వినూత్న కార్యక్రమం

51చూసినవారు
అసోంలో ఎన్నికలు.. విద్యార్థుల వినూత్న కార్యక్రమం
అసోంలోని కామ్‌రూప్‌ జిల్లాలో మే 7న లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో ఆ జిల్లాకు చెందిన విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్‌కార్డులు రాశారు. వందశాతం ఓటింగ్‌ నమోదయ్యేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం ‘మా ద్యూటాలోయ్‌, వోట్‌డానోర్‌ అహబాన్‌’ (ఓటు వేయమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి) ప్రచారం చేపట్టింది.

సంబంధిత పోస్ట్