కేరళలోని కలూర్‌కు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించింది. గొలుసులతో కట్టిన కుక్కల్లా మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించారని బాధిత ఉద్యోగులు ఆరోపించారు. ఈ విజువల్స్ స్థానిక మీడియాలో వైరలవడంతో మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. మా కంపెనీలో అలాంటి వేధింపులేమీ లేవని, ఆ దృశ్యాలు కొన్ని నెలల కిందటివని ఓ ఉద్యోగి చెప్పారు.