దేశ ప్రజలకు ప్రధాని మోడీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని పనుల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదర్శ పురుషుడైన శ్రీరాముని జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ వేడుక.. మనకు ఆదర్శప్రాయమైన జీవితం గడిపేందుకు ప్రేరణనిస్తుందన్నారు. ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడవాడలా వేడుకలు కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.