2024 నాటికి దేశంలో 13, 056 చదరపు కిలోమీటర్ల అడవులు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఎక్కువగా ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో అత్యధికంగా ఆక్రమణకు గురైన రాష్ట్రాల వివరాలను వెల్లడించింది. ఇందులో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉండగా, రెండో స్థానంలో అస్సాం, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.