కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తనను అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ కోర్టులో ఆమె భర్త జతిన్ హుక్కేరి పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా రన్యా భర్త తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. రన్యారావు, జతిన్ హుక్కేరి గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్నారని, అయితే డిసెంబరు నుంచి ఇద్దరు విడిగా ఉంటున్నట్లు కోర్టుకు వెల్లడించారు.