ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే డకౌట్ అయ్యారు. తొలి ఓవర్లో ఖలీల్ అహ్మద్ వేసిన నాలుగో బంతికి శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరారు. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోర్ 4/1 గా ఉంది. క్రీజులోకి విల్ జాక్స్ వచ్చారు.