TG: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీలు కుటుంబ కలహాలతో కత్తితో దాడి చేసుకుంటుండగా.. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ వెళ్లాడు. ఈ ఘటనలో అతిఫ్ ఎడమచేయికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.