ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

61చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు ప్రమాదవశాత్తు ఒక SUVని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనపై సీఎం విష్ణు దేవ్ సాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్