మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు పడడంతో.. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.