యూపీలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాగేశ్వర్ జిల్లాకేంద్రంలోని ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికులంతా ఇళ్ల నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.