జపాన్‌లో కార్చిచ్చు కలకలం రేపింది. ఉత్తర జపాన్ నగరం ఒఫునాటో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్చిచ్చు ఆగకుండా చెలరేగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందారు. దాదాపు 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు దశాబ్దాల్లో దేశంలో జరిగిన అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని పేర్కొన్నారు. 1,800 హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.