AP: రెండు నిమిషాల్లో కళాశాలకు చేరాల్సిన వైద్య విద్యార్థినిని కారు రూపంలో మృత్యువు కబళించింది. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నిమ్రా వైద్యకళాశాల సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన సయ్యద్ తాజ్ అఫ్షా (20), అలేజ్ జూపూడిలో అద్దెకుంటూ ఎంబీబీఎస్ చదువుతున్నారు. స్కూటీపై కాలేజ్‌కు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో అఫ్షా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.