గిలియన్–బార్ సిండ్రోమ్ (GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. శనివారం ఒక్కరోజే 9 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది.