చేప ప్రసాదానికి 177 ఏళ్లు

57చూసినవారు
చేప ప్రసాదానికి 177 ఏళ్లు
బత్తిని వీరన్న గౌడ్ కల్లు కాపౌండ్ నిర్వహించేవాడు. ఒక రోజు భారీగా వర్షంలో తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. సంతృప్తి చెందిన ఆ సాధువు ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను బత్తినికి చెప్పాడు. వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. వీరన్న 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు.

సంబంధిత పోస్ట్