AP: ప్రముఖ విద్యాసంస్థ పీఈఎస్ యూనివర్సిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ దొరస్వామి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కాగా, ఈయన కాంగ్రెస్ తరపున కర్ణాటకలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం నర్రావూరు గ్రామం. ఆయన కుప్పంలో మెడికల్ కాలేజీ, సొంత ఊరిలో పాఠశాల నిర్మించారు. దొరస్వామి నాయుడు సీఎం చంద్రబాబుకి సన్నిహితులు.