AP: MLC అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఫైనల్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం MLC అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన నుంచి ఎమ్మెల్యే కోటాలో MLCగా నామినేషన్ కు పార్టీ కార్యాలయం సర్వం సిద్ధం చేసింది. నాగబాబు MLC నామినేషన్ పత్రాలపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రెడీ చేసినట్లు సమాచారం.